మన్యం న్యూస్ మణుగూరు: సెప్టెంబర్ 03
కెసిఆర్ పల్లె ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉడతానేని గుంపు లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు పాల్గోన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను గడప గడపకు రేగా ఆభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పోశం.నరసింహరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లడుతూ,ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీ అందరిపై ఉందని అన్నారు. పినపాక నియోజకవర్గానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే రేగా కాంతారావు అని అన్నారు. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమాలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబరు వన్ అని తెలిపారు. ఏజన్సీ ప్రాంతం లో కోట్ల రూపాయలను మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే కాంతారావును రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సమితి సింగారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కంభంపాటి శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్దెల తిరుమలరావు,ఉసికెల రమణ,సంతాపురి.వెంకటేశ్వర్లు,కత్తుల.మోహన్రావు,భాషపోగు.వెంకటేశ్వర్లు,వేర్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.





