- ఆర్టీసీ నియామకాలలో హైర్ బస్ డ్రైవర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
- బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నా సర్ పాషా
- ఐఎఫ్ టీయు లో చేరిన మణుగూరు డిపో హైర్ బస్ డ్రైవర్లు
మన్యం న్యూస్ మణుగూరు: సెప్టెంబర్ 03
తెలంగాణ ఆర్టీసి లో త్వరలో చేపట్టబోయే తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నియామకాలలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని రెగ్యులర్ డ్రైవర్లుగా నియామకం చేపట్టాలని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్డి.నాసర్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఉదయం పీవి కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆర్టీసీ మణుగూరు డిపో హైర్ బస్ డ్రైవర్ల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశం అనంతరం ఐఎఫ్ టియు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆ సంఘంలో చేరుతున్నామని బస్ డ్రైవర్లు ప్రకటించారు.ఐఎఫ్ టియు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు,ఏరియా నాయకులు మంగీలాల్,ఓబి వర్కర్స్ యూనియన్ నాయకులు పెనుగొండ నాగార్జున మణుగూరు ఏరియా న్యూ డెమోక్రసీ నాయకులు సాధన పల్లి రవిల నాయకత్వంలో అద్దె బస్ డ్రైవర్లు ఐ ఎఫ్ టి యు లో చేరారు.నాయకులు వారిని సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు.చేరిక సందర్భంగా మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.గౌరవ అధ్యక్షులుగా మిడిదొడ్ల నాగేశ్వరరావు, అధ్యక్షులుగా పెరుగు కుమార్, ఉపాధ్యక్షులుగా అగ్గిరాజు, కార్యదర్శిగా లక్కీ శివాజీ లను ఎన్నుకున్నారు.అనంతరం నాయకులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్బంగా పలు తీర్మానాలను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఆర్టీసీ డ్రైవర్ల నూతన నియామకాలలో అద్దె బస్సుల మీద పని చేసే డ్రైవర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ టిఎస్ ఆర్ టిసి లో అద్దె బస్సుల డ్రైవర్లకు ఆర్టీసీ సిబ్బంది తరహా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అని,దీనికై ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలి అన్నారు.హైర్ బస్ డ్రైవర్లకు హైదరాబాదులోని ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలో ఉచిత వైద్య వసతి కల్పించాలి అని,అదేవిధంగా ఉచిత వైద్య పాసుబుక్కులు అందజేయాలి అని,తెలంగాణ ప్రభుత్వం జీవోల ప్రకారం హైర్ బస్సు డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలి అన్నారు.కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని వారు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమం లో కోశాధికారిగా గీత సందీప్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి జెట్టి నరసింహారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం సంతోష్ కుమార్,కమిటీ సభ్యులు సంపంగి మల్లేష్,వీర ప్రవీణ్,అన్వేష్,బాలు,శివాజీ, శేషు నాగార్జున,దుర్గ,హుస్సేన్, రామకృష్ణ,భాను,సాయి,దుర్గాప్రసాద్ ప్రదీప్,రమేష్,ప్రభాకర్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.





