మన్యం న్యూస్ మణుగూరు: సెప్టెంబర్ 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం గ్రామం లోని గుట్టమల్లారం గ్రామం పంచాయతీ జయశంకర్ కాలనీ చెందిన మైపా సౌదామని వారి భర్త మైపా వీరయ్య డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అన్ని విధాలా ఆదుకుంటామని,తమ వంతు సహాయం ఎల్లపుడూ చేస్తామని వారికి బరోసా కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, నాయకులు,కార్యకర్తలు రాణి. గోపి తదితరులు పాల్గొన్నారు.





