మన్యం న్యూస్ మణుగూరు: సెప్టెంబర్ 05
మణుగూరు మండలం లోని న్యూ పద్మగూడం ఏరియాలో ఏమంటుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు ప్రచారం చేస్తు, కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ,పినపాక నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావును రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పద్మగూడం ఏరియా కోఆర్డినేటర్స్ కుర్రి నాగేశ్వరరావు,నాయకులు వట్టం రాంబాబు,బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు, జాగృతి నాయకులు పవన్ ప్రతాప్ నాయక్,యువజన నాయకులు విద్యార్థి విభాగ నాయకులు,స్థానిక నాయకులు మరియు మహిళా నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





