మన్యం న్యూస్, వాజేడు: మండలంలో పూసూరు గ్రామం పరిధిలో 163వ జాతీయ రహదారి గోదావరి బ్రిడ్జి పై ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల వ్యక్తిగత లైసెన్సులను, వాహనాల కాగితాలను పరిశీలించారు. వాహనాలలో అనుమానితులుగా ఉన్నటువంటి వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.





