బీ ఆర్ ఎస్ లోకి వలసల జోరు
*ఎమ్మెల్యే రేగా సమక్షంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు
* నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తా:ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,బూర్గంపాడు: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమం, పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లోకి వలసలు జోలందుకున్నాయి.మండల పరిధి
నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు షేక్ అనీఫ్, కాశీం, జహీర్, అప్రోజ్, ఎస్కే మీరా, లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని అభయమిచ్చారు .ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ,యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





