UPDATES  

 ఎవరికైనా అవకాశం ఒక్కసారే వస్తుంది

ఎవరికైనా అవకాశం ఒక్కసారే వస్తుంది
* సద్వినియోగం చేసుకొని పోతే ఫలితాలు ఉంటాయి
* ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఉన్నంత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుందని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోతే అన్ని విజయాలు తప్ప పరాజయాలు ఉండవని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు తనకు మంత్రి పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ ఒక అవకాశం ఇచ్చారని దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఖమ్మం కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి సీఎం కేసీఆర్ ఘనతే అన్నారు. ఆయన ఆశీర్వాదం ఉండడం వల్లనే ఖమ్మంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోతే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. మంత్రిని చేసిన వ్యక్తి నేడు ఖమ్మంలో ఏదో చేయాలని చూస్తున్నాడని అదే అతని వల్ల కాదన్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి పాలేరు వైపు పోదాం అనే ఆలోచన మాది కాదన్నారు. తాను ఇక్కడ భూమిపుత్రుడిని మరోసారి ఆశీర్వదించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకె ఇంత అభివృద్ధిని చేసుకున్నామని తెలిపారు. కొందరికి కడుపు నొప్పి వస్తే అందరికి కడుపు నొప్పి రావాలని కొందరు భావించడం సరైనది కాదన్నారు.
యువకులు రాజకీయాలలోకి రావాలి అంటే మాకు అవకాశం ఇస్తేనే రావడం జరిగిందన్నారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. ఖమ్మం అభివృద్ధిలో ముందు ఉందని వెనుకకు నెట్టాలి అని కొందరు కలలు కంటున్నారని తెలిపారు.
రుమర్స్ గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలని చూస్తున్నారని వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎమ్మెల్యే సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !