UPDATES  

 ఆర్టీసీ కుటుంబాలకు అండగా కేసీఆర్

ఆర్టీసీ కుటుంబాలకు అండగా కేసీఆర్
* ఆయన సీఎం అయ్యాక తెలంగాణలో అభివృద్ధి పరుగులు
* కెసిఆర్ శక్తిని చూడలేక కొందరు జిమ్మిక్కుల రాజకీయాలు
* ఎవరెన్ని కుట్రలు పన్నినా మళ్లీ అధికారం కెసిఆర్ దే
* ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ ఆర్టీసీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా అందులో పని చేసే కార్మికులకు మేలు చేసేందుకు నేడు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి 43 వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుందన్నారు. ఆదివారం ఖమ్మం కేంద్రంలో మంత్రి అజయ్
ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరబాద్ లోని ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్ తరువాత అంత పెద్ద బస్ స్టాండ్ మన ఖమ్మంలోని ఉందన్నారు. 30 ప్లాట్ ఫాం తో అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసి సంస్థల కోసం రూ.200 కోట్లు రుణం తీసుకుని అభివృద్ది చేశామన్నారు. మాల్ అండ్ మల్టీప్లెక్స్ లు కన్వెన్షన్ హాల్స్ ఇలా కమర్షియల్ సంస్థలు ఎర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో ఇంతటి అద్భుత కన్వెన్షన్ హాల్ లేదని దాదాపు 2వేల మందికి సరిపడుగా అధునాతన డిజైన్ తో రూ.40 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు.
ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ దే అధికారం…
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు రాజకీయ నిరుద్యోగులు బయలుదేరారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మళ్ళీ అధికారం కేసీఆర్ దే అని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా బయటకు వస్తున్న వారు
పదవిలో ఉన్న అంత కాలం ఖమ్మంలో ఒక్క శిలాఫలకం కూడా నిర్మించలేదన్నారు.
ఖమ్మంకు తట్టెడు మట్టి కూడా పోయానివాడు అసెంబ్లీ గేటు తకానియను అని అంటాడాని విరుచుకుపడ్డారు. ముసలి కన్నీరు కారుస్తూ డబ్బు రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని వారిని ప్రజలు తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !