మన్యం న్యూస్ ,ములకలపల్లి: సెప్టెంబర్ 03. కొత్తగూడెం కోర్టులో ఈ నెల 9న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములకలపల్లి ఎస్సై సాయి కిశోర్ రెడ్డి కోరారు. లోక్ అదాలత్ లో రాజీ పడే కేసులలో రాజీ పడవచ్చని,డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అతి తక్కువగా 1000 నుండి 1500 లోపు ఫైన్ వేయబడుతుందని, సెప్టెంబర్ 9వ తేది వరకు ఏ రోజైనా మీరు కోర్టులలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్ కేసులు,చెక్కు బౌన్స్ కేసులు,మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు,లేబర్ కేసులు,సివిల్ కేసులు,కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగిన ముందస్తు తగాదాలు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చనని ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి మండల ప్రజలకు తెలియజేశారు.





