- అన్ని కులాల వారికి గృహలక్ష్మి పథకం వర్తింపు
- పినపాక నియోజకవర్గ ప్రజలు అధైర్య పడొద్దు
- అర్హులైన అన్ని కులాల వారికి ఇండ్లు మంజూరు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
మన్యం న్యూస్, పినపాక:
పినపాక నియోజకవర్గంలోని ప్రజానీకం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గిరిజనులతోపాటు అర్హులైన ఎస్సీ, బీసీ , ఓసి అన్ని కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం “గృహలక్ష్మి” ఇండ్లు మంజూరు చేస్తుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ తెలిపారు. ఆదివారం ఆయన బయ్యారం క్రాస్ రోడ్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏజెన్సీలోని అన్ని కులాల వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేయించాలని, శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారని, ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించి అర్హులైన అన్ని కులాలలోని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కొందరు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మొద్దని, అర్హులైన ప్రతినిరుపేదకు ఇంటి





