మన్యం న్యూస్, మంగపేట:
ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో 2020- 21 ట్రై కార్ రుణాల లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసి నేటికి ఋణాలు మంజూరు చేయలేదనిఆదివాసి సేన మండల అధ్యక్షుడుపోలేబోయిన ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా ఆయన ఆదివారం మంగపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగపేట మండలంలోని 270 మంది లబ్ధిదారులకు మంజూరైన రుణాల కు సంబంధించి ఏటూరి నాగారం ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాధర్బాల్లో ఐటిడిఏ(పిఓ) కు వినతి పత్రం ఇచ్చి రెండు నెలల గడిచిన ఐటిడిఏ అధికారులకు చలనం లేదన్నారు. ఆదివాసీల ట్రైకార్ రుణాలకు సంబంధించి రెండు సంవత్సరాల క్రితం గ్రామ సభలు పెట్టి నేటి వరకు మంజూరు చేయకుండా లబ్ధిదారులకు తీవ్రంగా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు మంజూరైన ఋణాల ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో , మండల నాయకులు ఎడం సమ్మయ్య తుడుందెబ్బ జిల్లా నాయకులు పొడెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





