మన్యం న్యూస్, మంగపేట
రెండవ స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా ఆదివారం 109- ములుగు శాసన సభ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సత్యపాల్ రెడ్డి మంగపేట మండలం లోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని, అధికారులు పాఠశాలలు, కళాశాల లను సందర్శించి ఓటు నమోదుకు ప్రజల్లో అవగాహనా కల్పించి ప్రజాస్వామ్యం లో యువత తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు సహకరించాలని సూచనలు చేశారు.చనిపోయిన వారి ఓట్లు తొలగించడం, చిరునామా, ఫొటోలు మార్పులు, తప్పు, ఒప్పులు సవరించుటకు దరఖాస్తులు స్వీకరించి సమస్యలు వేగవంతం గా పూర్తి చేయాలనీ సూచనలు చేశారు.





