ఘనంగా పగడాల సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
*పినపాక, మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రులలో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసిన బి ఆర్ ఎస్ యువ నాయకులు
మన్యం న్యూస్, పినపాక:పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు .పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్ హర్ష_నాయుడు చేతుల మీదుగా పినపాక మండల రేగా టీమ్ బండ మనోజ్ రెడ్డి, గోగు రామకృష్ణ, గురిజల ప్రశాంత్ ,పూస సంతోష్,పవన్ అధ్వర్యంలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు మణుగూరు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దు బ్రెడ్,పళ్లు పంపిణీ చేయడం జరిగినది. సతీష్ రెడ్డి అన్న ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరిన్ని రాజకీయ పదవులు భవిష్యత్తులో అలంకరించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్ .ఎస్ యువజన నాయకులు బోయిళ్ళ రాజు, పినపాక నియోజకవర్గం యువజన విభాగం కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి , సోషల్ మీడియా వారియర్స్ పూస సంతోష్, గురిజాల ప్రశాంత్, గోగు రామకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ పోట్లపల్లి యువజన నాయకులు పవన్,తదితరులు పాల్గొన్నారు.





