UPDATES  

 ఎమ్మెల్యే రేగ అభివృద్ధికి ఆకర్షితులై బి.ఆర్ .ఎస్ లో పలు కుటుంబాలు చేరిక

ఎమ్మెల్యే రేగ అభివృద్ధికి ఆకర్షితులై బి.ఆర్ .ఎస్ లో పలు కుటుంబాలు చేరిక

బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం.

బిఆర్ఎస్ పాలనకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ.

*బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం:ఎమ్మెల్యే రేగా కాంతరావు

మన్యం న్యూస్ బూర్గంపహాడ్ : పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై రోజు,రోజుకు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి.మణుగూరు మండల పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బర్ల పెద్దబాబు,బర్ల కొండయ్య వారి సహచరుల 20 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులు అయ్యి బూర్గంపహాడ్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నుంచి సుమారు 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం ఆదివారం పుచ్చుకున్నారు.వారికి ఎమ్మెల్యే రేగా కాంతరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు,అనంతరం పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు,ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని,రాబోవు రోజులలో పెద్ద మొత్తంలో చేరికలు ఉంటాయన్నారు,స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్రంనీ పునర్నిర్మించారని కొనియాడారు.పార్టీలో కొత్త,పాత అన్న తేడా లేకుండా అందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు,బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నదని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు,బిఆర్ఎస్ తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది అన్నారు,పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.ఈకార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,బూర్గంపహడ్ సర్పంచ్ సిరిపురం సప్న,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్,బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని,పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !