మన్యం న్యూస్,ఇల్లందు: హైదరాబాదులోని శామీర్ పేట్ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సన్నిహితులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ శుభకార్యంలో కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుతో ఎమ్మెల్యే హరిప్రియ కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు.





