UPDATES  

 గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణుల ప్రచార సందడి.

  • గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణుల ప్రచార సందడి.
  • గడప, గడపకు సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలు.
  • బిఆర్ఎస్ కే ప్రజల మద్దతు:జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
  • సందేళ్ల రామాపురంలో బీ. ఆర్.ఎస్ ప్రచార సందడి.

మన్యం న్యూస్, బూర్గంపహాడ్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ.ఆర్.ఎస్ పార్టీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బీ. ఆర్.ఎస్ ఇంటింటా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం జోరందుకుంది.ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో మండల నాయకులు,కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సారపాక పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రలను అందజేస్తూ,ప్రభుత్వ పధకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజల మాటలను బట్టి ఈ ఏడాది కూడా బిఆర్ఎస్ కే ప్రజా బలం అన్నట్టుగా ఉందని నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు,ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చందర్,సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మి చైతన్య రెడ్డి,మండల ఎస్సి సేల్ అధ్యక్షులు సాలయ్య తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సందేళ్ల రామాపురంలో ప్రచార సందడి.

ముసలమాడుగు గ్రామ పంచాయతీలో గల సందేళ్ల రామాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గౌరవిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రలను పంపిణీ చేసే కార్యక్రమం సందడిగా నిర్వహించారు.ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయ లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు పోడియం నరేంద్ర,సీనియర్ నాయకులు కురసం వెంకన్న,గ్రామ ఉప సర్పంచ్ గండమల్ల మల్లయ్య పలువురు నాయకులు,గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !