అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు
ఉద్యోగ భద్రత కల్పించాలి.
* సిఐటియు జిల్లా అధ్యక్షులు కే. బ్రహ్మచారి
మన్యం న్యూస్, చర్ల:
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయాలని మినీ టీచర్లకు మెయిన్ టీచర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు నిరవధిక సమ్మె కు దిగనున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అన్నారు.ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దారు కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి, తెలంగాణ టీచర్స్ అంగన్వాడి టీచర్స్ అధ్యక్ష కార్యదర్శులు నాగమణి, విజయశీల, బాలాజీ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తాళ్లూరి కృష్ణ, స్వరూప, చిలకమ్మా కృష్ణవేణి, హేమలత, ఇర్ఫా సత్యవతి, సావిత్రి, త్రివేణి అంజమ్మ రాణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





