సేవాలాల్ సేన మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జి రవినాయక్
మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీప్రకారం వెంటనే గిరిజనబందు అమలుచేయాలని సేవాలాల్ సేన మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా రవినాయక్ అన్నారు. ఈ మేరకు ఇల్లెందు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ శివనాయక్, మండల నాయకులు కిషన్ నాయక్, వీరునాయక్, శివాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.





