మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం గ్రామపంచాయతీ లోని గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులతో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా మాట్లాడుతూ అధికారులు గృహలక్ష్మి పథకంలోని లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అన్నారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం అనేది నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా ప్రతి ఒక్క ఇల్లు లేని నిరుపేదలకు నేటి తెలంగాణ ప్రభుత్వం సీఎం కెసిఅర్ ఇల్లు మంజూరు చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకె.రామనాథం, పంచాయితీ సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డి,రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.





