కామేపల్లి మండలంలో బిజెపి,కాంగ్రెస్ ,టిడిపి, సిపిఐ పార్టీల నుంచి 95 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం కామేపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ సమక్షంలో 95 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులైన బీజేపీ, కాంగ్రెస్, తెదేపా, సీపీఐ పార్టీల కార్యకర్తలకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గులాబి కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తానుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరిన 95 కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో చేరిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.
గతపాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని ఇల్లందు నియోజకవర్గం తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, రైతుబంధు సమన్వయ సమితి కన్వీనర్ అంతోటి అచ్చయ్య, కామేపల్లి ఎంపీపీ బానోత్ సునీత, కామేపల్లి వైస్ ఎంపీపీ అజ్మీర విజయలక్ష్మి, కామేపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కర్ణమాల రాంబాబు, కొత్తలింగాల కోటమైసమ్మ దేవస్థానం చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాసరావు, ముచ్చర్ల సర్పంచ్ జాయ్ లూసీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





