UPDATES  

 గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను గడువు లోపు త్వరితగతిన పరిష్కారం చూపాలి

గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను గడువు లోపు త్వరితగతిన పరిష్కారం చూపాలి
*ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బారులో గిరిజనుల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి సమస్యలను వాటిని గడువు లోపు త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టార్ అధికారులను ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆదేశించారు.ఈ గిరిజన దర్బార్ లో వివిధ మండలాల నుండి వచ్చిన గిరిజనులు దరఖాస్తులను ప్రాజెక్టు అధికారి సంబంధించిన సెక్టార్ అధికారులకు సూచించారు.గోవిందరావుపేట మండలం సోమల గడ్డ గ్రామానికి చెందిన దీపిక ములుగు టిడబ్ల్యూఆర్ జె సి కళాశాలలో ల్యాబ్ అటెండర్ గా ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. మంగపేట మండలం అబ్బాయి గూడెం గ్రామానికి చెందిన కోరెం కమలాకర్ ఇంచర్ల టీఎస్ గురుకులంలో ఐదోతరగతి నందు సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ఏరియా,ఏజెన్సీ ప్రాంతం ప్రభుత్వ అధికారులను,గిరిజన సంఘాలను కలుపుకొని ఐటీడీఏ కార్యాలయంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసి కోరినారు.ఏటూరు నాగారం మండలం లంబాడి తండ గ్రామానికి చెందిన నాగవత్ శిరీష తన కుటుంబ పోషణ కు ఐటీడీఏ ద్వారా ఈ ఎస్ ఎస్ స్కీం నుండి ఆర్థిక పోషణకై పారితోషకం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన కొమురం శంకర్ రావు గతంలో వాయిదా వేసిన పేసా గ్రామ సభను మరల నిర్వహించారని దరఖాస్తు చేసినారు.వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రామ్ దాస్ వారసత్వ పట్టా బుక్కు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన రేగ శ్రీలత ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.మంగపేట మండలం
శనగకుంట గ్రామానికి చెందిన తోలెం నర్సింగరావు తమ గ్రామానికి చెందిన చెరువుకు కరకట్ట నిర్మాణం చేయాలని దరఖాస్తు చేసినారు.ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన జరుపుల రాంబాబు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ఇప్పించాలని దరఖాస్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,డిప్యూటీ డైరెక్టర్ పోచం,జిసిసి డిఎం ప్రతాప్ రెడ్డి,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ క్రాంతి కుమార్,ఎస్ ఓ రాజ్ కుమార్,ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్ తదితర సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !