మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 4::
మండలంలోని నడికుడి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు నీటి సమస్యను తీర్చాలని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ మూర్తికి అందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతంలో నీళ్ల కోసం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మిషన్ భగీరథ నీరు రాక రెండు వారాలు అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పంచాయతీ పరిధిలోని సాగులో ఉన్నటువంటి పోడు రైతులకు పట్టాలు అందరూ విషయంలో అవుతవుకలు జరిగాయని సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ నడికుడి గ్రామానికి మిషన్ భగీరథ లీకేజీల వల్ల నీటి సమస్య ఉందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల కరెంటు ఇబ్బందు ఉందని విద్యుత్ అధికారులకు తెలియజేశామని అన్నారు. పోడు సాగు భూమి లబ్ధిదారులకు పట్టల ఇవ్వకపోవడంపై ఆన్లైన్లో అప్లై చేశామని ఇట్టి విషయం పిఓ దృష్టికి తీసుకుపోయామని త్వరలోనే వారికి మంజూరు అవుతాయని వారికి హామీ ఇచ్చారు. అలానే నడికుడి కొంగ వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, ముద్దరాజు, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, రత్నకుమార్, చందు, సీత, తదితరులు పాల్గొన్నారు.





