UPDATES  

 ఈ నెల 11 నుండి సీఐటీయు, ఏఐటీయుసీల అధ్వర్యంలో అంగన్వాడీ నిరవధికసమ్మె

ఈ నెల 11 నుండి సీఐటీయు, ఏఐటీయుసీల అధ్వర్యంలో అంగన్వాడీ నిరవధికసమ్మె ఎమ్మార్వోకి సమ్మె నోటీసు ఇచ్చిన నేతలు
మన్యంన్యూస్,ఇల్లందు:అంగన్వాడీ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 11న నిరవధిక సమ్మె చేయనున్నట్లు సీపీఐ పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ అన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కోట రవికుమార్ కు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ సిబ్బందికి కనీసవేతనం ఇవ్వాలని, పదిలక్షల గ్రాట్యుటీ, పెన్షన్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తదితర న్యాయపర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఫలితంలేని కారణంగా సీఐటీయు, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో సమ్మెబాట పడుతున్నామని తెలిపారు. ఈ నెల 11నుండి అంగన్వాడీ సెంటర్ కు తాళాలు వేసి టీచర్లు, ఆయాలు సమ్మెలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటియూసి నేతలు ఫాతిమా, నాగలక్ష్మి, కారం పద్మ, అంజలి, మేరి, సుజాత, కడారీ వెంకటమ్మ, నాగమణి, బంధం నాగయ్య, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !