మన్యం న్యూస్ చండ్రుగొండ సెప్టెంబర్ 04 : మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి తన సొంత ఖర్చులతో నడవలేని స్థితిలో ఉన్న రోడ్లను గ్రావెల్ పోసి మెరుగుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మా సొంత గ్రామమైన తిప్పనపల్లి లో మా ప్రజలు నడవలేని పరిస్థితిలో ఉన్న రోడ్లను చూసి బాధాకరంగా ఉందని, సహృదయంతో నా సొంత ఖర్చులతో గ్రావెల్ పోసి రోడ్లు మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి సహృదయంతో చేసిన సహాయాన్ని గ్రామస్తులు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.