UPDATES  

 సింగరేణి నూతన టెండర్లలో నిర్వాసితులకు స్థానికులకు ఉపాధి కల్పించాలి

సింగరేణి నూతన టెండర్లలో నిర్వాసితులకు స్థానికులకు ఉపాధి కల్పించాలి

ఎస్ ఓ టు జిఎం వీసం కృష్ణయ్య వినతి పత్రం అందజేసిన ఐఎఫ్ టియు నాయకులు

మన్యం న్యూస్ మణుగూరు:సెప్టెంబర్ 04

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వివిధ గనులు డిపార్ట్మెంట్లలో, ఏరియా హాస్పిటల్ లో పొరుగు సేవలకు ఖరారైన నూతన టెండర్లలో సింగరేణి భూ నిర్వాసిత కుటుంబాలకు చెందిన స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం వీసం కృష్ణయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్డి.నాసర్ పాషా మాట్లాడుతూ,మణుగూరులో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కొత్త పనులు టెండర్ ఖరారు అయితే కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం అవుతోందని పైసలు పెట్టు పనిపట్టు అన్న విధంగా కొంతమంది కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని అతి కొద్ది మంది మాత్రమే నిజాయితీ గల కాంట్రాక్టర్లు ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నిర్వాసితులకు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారని కానీ కొంతమంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం ఈ విషయమ పై స్పందించాలని వారు కోరారు. అన్ని విధాలుగా త్యాగం చేసిన నిర్వాసితులకు,స్థానికులకు కనీసం కాంటాక్ట్ కార్మికులుగా అయినా ఉపాధి కల్పించాల్సిన సామాజిక బాధ్యత సింగరేణి యాజమాన్యానీదే అన్నారు.కొత్తగా ఏరియా హాస్పిటల్ లో ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి నూతన టెండర్ వచ్చిందని,నిర్వాసితులు పని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ఉన్నదని చెప్పిన కూడా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించడం లేదని నాసర్ పాషా తెలిపారు.ఏరియా హాస్పిటల్ లో కూడా కొత్త టెండర్లు కరోనా సమయంలో పనిచేసిన పాత వారికి నిర్వాసితులకు,ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా యాజమాన్యం చర్యలు చేపట్టాలని వారు కోరారు.యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్,నిర్వాసితులు సిహెచ్ కాంతారావు,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !