పల్లె పల్లెనా కెసిఆర్ ప్రగతి బాట కార్యక్రమం
గ్రామాలలో బిఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం
-జడ్పీటీసీ పోశం నర్సింహారావు
మన్యం న్యూస్ మణుగూరు:సెప్టెంబర్ 04
మణుగూరు మండలం లోని వివేకానంద కాలనీ,తోగ్గూడెం గ్రామాలలో మణుగూరు జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు బిఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పోశం.నరసింహరావు బిఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా జడ్పీటీసీ పోశం. నర్సింహారావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీ అందరిపై ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని స్థానిక నాయకులు బలోపేతం చేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలందరికీ అందే విధంగా చూడాలన్నారు.పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో అభివృద్ధి,సంక్షేమంలో సరికొత్త రికార్డులను నమోదు చేశారు అన్నారు.పినపాక నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావును రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గం రజిత,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నవీన్,సమితి సింగారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంభంపాటి శ్రీను,బుద్దుల ప్రసాద్,కట్ట రాజ్ కుమార్,స్థానిక వార్డు మెంబర్ ప్రవీణ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.