మన్యం న్యూస్ మణుగూరు:సెప్టెంబర్ 04
మణుగూరు మండల పరిధిలోని సమితిసింగారం గ్రామ పంచాయతీ ఏరియాకు చెందిన అంగనవాడి సూపర్వైజర్ గుండి పద్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి వారి నివాసానికి వెళ్లి గుండి పద్మను పరామర్శించారు.ఈ సందర్బంగా వారి ఆరోగ్య విషయాలు తెలుసుకొని,అనంతరం వారికీ అన్ని విధాలుగా,ఎల్లప్పుడూ అండగా ఉంటామని బరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టి సీనియర్ మహిళా నాయకురాలు తాళ్లపల్లి రజిత,రాణి మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.