- బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యం
- ప్రతి ఒక్కరు సైనికులలా పనిచేయాలి
- రాజకీయాలలో యువత కీలక పాత్ర వహించాలి
- పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్
మన్యం న్యూస్ మణుగూరు:సెప్టెంబర్ 04
మణుగూరు మండలం లోని పగిడేరు పంచాయతీ నందు సొంబాయిన గంగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువజన సమావేశంలో పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ పాల్గొన్నారు. సాగర్ యాదవ్ మాట్లాడుతూ,పార్టీకి యువతే బలమని పార్టీ బలోపేతానికి యువత సైనికులా పనిచేయాలని అన్నారు.పార్టీ బలోపేతానికి యువ నాయకులు కీలక పాత్ర పోషించలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు ప్రచారం చేయాలన్నారు.ప్రతి కార్యకర్తకు గులాబీ జెండా అండగా ఉంటుంది అన్నారు.పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యసాధన దిశగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు..ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలి అన్నారు.ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సైనికుల పని చేసి,ఎమ్మెల్యే రేగ కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దామల్ల దయాకర్,వార్డ్ మెంబర్ బుచ్చి రాములు,పినపాక నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి భానోత్ రమేష్ నాయక్,యువజన నాయకులు బోయిళ్ళ రాజు,నాగేశ్వరరావు,బేతమల్ల సుందర్,పగిడేరు గులాబీ యువసైన్యం,సోషల్ మీడియా వారియర్ డేగల సంపత్ కుమార్,స్థానిక యువత పూనెం రాము,కుంజా నాగరాజు,కుంజా అశోక్,శంకర్ తదితరులు పాల్గోన్నారు.