*నేడు పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం
*విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,మణుగూరు:మండల పరిధి
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం ఉదయం 8 గంటలకు పినపాక నియోజకవర్గ స్థాయి రేగా,బీ. ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందని విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి
సోషల్ మీడియా వారియర్స్ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు.