సీఎం కేసీఆర్ ఆశీర్వాదం…
వీధి రోడ్లను బాగు చేశా
* పినపాక నియోజకవర్గ అభివృద్ధి కి వరదలా నిధులు తీసుకువచ్చా
* అభివృద్ధి చేసి చూపెట్టా
* మరోమారు అవకాశం ఇవ్వండి
*నియోజక వర్గాన్ని డబుల్ అభివృద్ధి చేస్తా
*రూ.1 కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు
* అభివృద్ధి కావాలంటే.. రావాలి రేగాఅంటూ అశ్వాపురం మండలంలో మార్మోగిన బీఆర్ఎస్ కార్యకర్తల నినాదం
మన్యం న్యూస్ ,అశ్వాపురం: పినపాక నియోజకవర్గ ప్రజలు మరో మారు ఇచ్చిన అవకాశంతో పాటు, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పినపాక నియోజకవర్గ రూపు రేఖలు మార్చానని ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు. ఆశ్వాపురం మండలం లోని పలు గ్రామాలలో రూ కోటి20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారంప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే రేగాకు అభివృద్ధి కావాలంటే రావాలి రేగాఅంటూ నినాదాలనడుమ పూలమాలలతో ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అశ్వాపురం, మొండికుంట, నెల్లిపాక, ఆనందపురం గ్రామ పంచాయతీలలో పర్యటించి,స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో సుమారు 1 కోటి 20 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన 24 సీసీ రోడ్లను, ప్రారంభించారు.తుమ్మల గూడెం గ్రామపంచాయతీలో సుమారు రూ.20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భావన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రత్యేక విజన్ తోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందఅన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని , ప్రతిపక్షాలు ఏమి చేయలేక తికమక పడుతున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అన్నారు .పల్లెలలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంది అన్నారు.గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి కేరాఫ్ గా నిలిచింది అన్నారు. గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ రెడ్డి,వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం,ఎంపీటీసీలు దుర్గ భవాని, తాటి పూజిత,గాదె జయ ,స్థానిక సర్పంచ్లు బానోత్ శారద,మరి మల్లారెడ్డి, వుస జ్యోతి,గొర్రె ముచ్చు వెంకటరమణ,ఉప సర్పంచ్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్,కందుల కృష్ణార్జునరావ్,సూది రెడ్డి గోపిరెడ్డి ,నారాయణరెడ్డి,మొగిల్లా వీరారెడ్డి,మిట్టకంట సురేందర్ రెడ్డి,ఎస్.కె నయం, జావిద్,పినపాక నియోజకవర్గం యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్ యాదవ్,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,జూపల్లి కిరణ్,లోహిత్, ప్రశాంత్,పవన్,కిషోర్,రాము ,రవీందర్,కృష్ణ,ఎమ్మార్వో రమాదేవి, ఎంపీడీవో వరప్రసాద్,మండల నాయకులు , యువజన యువజన, ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు.
