మన్యం న్యూస్,అశ్వాపురం:
మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన వల్లపు గోపి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మృతిని నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
