మన్యం న్యూస్,కరకగూడెం:
మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన రైస్ మిల్లు యజమాని పోగు కృష్ణ సోమవారం ఉదయం తన వ్యక్తిగత పనిమీద కారులో హనుమకొండకు బయలుదేరాడు. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలో బంజర ఎల్లాపూర్ గ్రామం దాటిన అనంతరం నాంపల్లి సమీపంలోని క్రాస్ వద్ద చెట్టుకుకారు ఢీకొని అదుపుతప్పి అడవిలోకి తీసుకెళ్ళింది. కృష్ణ చెవ్వుకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కృష్ణ ను హనుమకొండకు తరలించినట్లు సమాచారం.
