UPDATES  

 ఇల్లందు కాంగ్రెస్ లో వర్గ పోరు

ఇల్లందు కాంగ్రెస్ లో వర్గ పోరు
* ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహుల సంఖ్య36
* ఎవరికి టికెట్ కేటాయించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న టి పి సి సి
* టికెట్ ప్రకటిస్తే కల్లోల కాంగ్రెస్
* పొంగులేటి పర్యటనలో కోరం తప్ప కనపడని మిగతా ఆశావాహులు
* దయానియంగా మారిన ఇల్లందు కాంగ్రెస్ నియోజకవర్గ పరిస్థితి

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:
గ్రూపు రాజకీయాలకు, ముఠా రాజకీయాలకు కన్న తల్లి కాంగ్రెస్ అనే మాటను ఇల్లందు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు సార్ధకం చేస్తున్నారు. ఒకరంటే మరొకరికి విభేదాలు లేవని పైకి అంటూన్నారే కానీ వారి వ్యవహారం ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉంది. చివరి రెండు అసెంబ్లీ ఎన్నికలల్లో ఇల్లందు నియోజక వర్గంలో కాంగ్రెస్ గెలిచి ఓడింది. మూడవ సారి కూడా తప్పక గెలుస్తుంది అనే భావనతో ఆశావహులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ప్రధానంగా చీమల వెంకటేశ్వర్లు , డాక్టర్ రవి, దల్ సింగ్ నాయక్, పెండకట్ల యకయ్యా దొర,వెంకట ప్రవీణ్ కుమార్, రాంచందర్ నాయక్, విజయ లక్ష్మి , టీచర్ లక్ష్మణ్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్, అరెం పాపారావు, లాయర్ కిషన్ నాయక్ వంటి వారిని ప్రధాన ఆశావహులుగా పేర్కొన వచ్చును. వీరిని కలుపుకుని ఇల్లందు నియోజక వర్గం బరిలో నిలిచేందుకు అత్యధికంగా 36 దరఖాస్తులు ఆశావహులు గాంధీభవన్ లో దాఖలు చేసిన విషయం తెలిసిందే. టికెట్ హామీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం కోరం కనకయ్య పార్టీలో చేరారు అనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఏదిఏమైనప్పటికి గెలుపు గుర్రానికే టికెట్ వరిస్తుందనే అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరికి వారే సొంతంగా అనుచరులతో నియోజక వర్గంలో ప్రజల్ని కలుస్తూ ప్రభావాన్ని పెంచుకునే పనిలో పాడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు పర్యాయాలు ఇల్లందు పర్యటన సందర్బాలలో పైన పేర్కొన్న ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా శ్రీనివాస్ రెడ్డి కి ఎదురు పడిన దాఖలాలు లేవు, ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొన్నది లేదు. ఒక రాష్ట్ర స్థాయి నేత పర్యటన లో నియోజక వర్గ సీనియర్ నేతలు పాల్గొనకపోవడం అనేది అనుమానాలకు తావు ఇస్తుంది. ఇది కాంగ్రెస్ అభిమానులకు రుచించటం లేదు. డాక్టర్ శంకర్ నాయక్ కు జిల్లా ప్రెసిడెంట్ పోదెం వీరయ్యకు పడకపోవడం, డాక్టర్ రవి,కోరం కనకయ్య, చీమల వెంకటేశ్వర్లు, పేండకట్ల యకయ్య , విజయ లక్ష్మి తదితరులు చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నాయి.ఒకరినొకరు కలుపుకు పోయే తత్వం లోపించింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. పార్టీలో స్థిరంగా ఉంటూ కష్ట పడుతున్న వారిని కాదని కోరం కనకయ్య కు టికెట్ ఇవ్వటం కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నీళ్ళు చల్లటమే అవుతుందని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇల్లందు కాంగ్రెస్, అధిష్టానం అభ్యర్ధి ప్రకటన తర్వాత బాంబులా పేలనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఉండగా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి 36 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ ఎవరికి కేటాయించాలో అర్థం కాక ఈ విషయం టి పి సి సి కి పెద్ద తలనొప్పిగా మారింది. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పరిస్థితి దయానియంగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !