UPDATES  

 బీ ఆర్ ఎస్ కి తిరుగులేదు… రేగాకు ఎదురు లేదు

బీ ఆర్ ఎస్ కి తిరుగులేదు… రేగాకు ఎదురు లేదు
*ఎమ్మెల్యే రేగా సమక్షంలో 50 కుటుంబాలు బీ. ఆర్.ఎస్ లో చేరిక
* రేగా అభివృద్ధి కి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుదేలు

బిఆర్ఎస్ ను ఢీకొనే శక్తి ఏ పార్టీకి లేదు :విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,పినపాక: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.సోమవారం
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రేగాగులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ గూటికి చేరుతున్నారని అన్నారు. ప్రజలందరూ బిఆర్ఎస్ వైపు ఉన్నారని అన్నారు, అభివృద్ధి సంక్షేమంలో సీఎం కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారు.
పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు
సుస్థిర పాలన బిఆర్ఎస్ తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు, సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు
ఈ కార్యక్రమంలో పినపాక మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పలువురు బీ .ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !