- గడపగడపకు బిఆర్ఎస్
- హ్యాట్రిక్ విజయమే లక్ష్యం
- -బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు పట్టణ పరిధి లోనీ బండారుగూడెం లో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు ఆధ్వర్యంలో యువ వ్యాపారస్తులను కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధి కార్యక్రమా లను విసృతంగా ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని,అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు భారత్ జాగృతి జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్, బిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రాహుల్ గౌడ్,బిఆర్ఎస్వి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి చరణ్,భరత్,నితిన్,ప్రవీణ్,చింటూ,చందు,సందీప్,సాయి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.