బీ. ఆర్.ఎస్ సోషల్ మీడియా వారియర్స్..
*ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి
*మణుగూరు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
* సోషల్ మీడియా సభ్యులకు అండగా ఉంటా:రేగా
మన్యం న్యూస్,మణుగూరు:
మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విస్తృత స్థాయి సమావేశం పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీ. ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్లాలని అదేవిధంగా పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు .
బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి పనులను ప్రజలకు అర్థమయ్యే రీతిలో క్రియేటివిటీ తో రూపొందించి సోషల్ మీడియా గ్రూపులలో విస్తృతంగా షేర్ చేయాలన్నారు. కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అని ఆయన అన్నారు.
ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాలి అన్నారు. ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు
సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంత స్వచ్ఛంద సైనికులు బీ. ఆర్.ఎస్ కు ఉన్నారని అన్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు, సోషల్ మీడియా వారియర్స్ కు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల సోషల్ మీడియా అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్, తదితరులు పాల్గొన్నారు.
