మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో మనుబొతుల కొమరయ్య 27వ వర్థంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక పాతబస్టాండ్ సెంటర్లో గల కొమరయ్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డిప్యూటి ప్రధాన కార్యదర్శి సారయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ వ్యవస్థాపక సబ్యుల్లో కొమరయ్య ఒకరని, తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటంలో గేరిల్లా పొరులొ పాల్గొన్నారని తెలిపారు. నిరంతరం కార్మిక పక్షాన అనేక పొరాటలు నిర్మించి హక్కులు సాదించిన ఘనుడు కొమరయ్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచి సహయ కార్యదర్శు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరిమి సుందర్, క్లర్క్ల్ స్టాఫ్ ముస్తఫా, టిజేఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులోత్ కృష్ణ, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు బందంనాగయ్య, ఉడుత ఐలయ్య, షంశుద్దిన్, ఫిట్ కార్యదర్శులు మంచాల వేంకటేశ్వర్లు, సంజీవచారి, నూనే శ్రీనివాస్, జంగపల్లి మోజెస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.