మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:-
తానా ఫౌండేషన్ వారు బోధనా అభ్యాస సామాగ్రిని ఇల్లందు మండలం రొంపెడు గురుకుల పాఠశాలకు, గురుపూజోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బహూకరించారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తానా ఫౌండేషన్ వాసు బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారి రమాదేవి, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి , ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.