మన్యం న్యూస్ ,మణుగూరు: ఏ రంగం అభివృద్ధి చెందాలన్న దానికి గురువు కృషి అవసరమని అటువంటి గురువులను సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా స్మరిస్తూ గురుపూజోత్సవంగా నిర్వహించడం గర్వ కారణమని మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా విద్యార్థులు గురువుల్ని సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకుల తోటి విద్యార్థులకు బోధించడం ఒక మంచి అనుభూతిని దాన్లో పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.