UPDATES  

 అభివృద్ధి చేశా…. మరల నిండు మనస్సు తో ఆశీర్వదించండి *ఎమ్మెల్యే రేగా కాంతరావు

అభివృద్ధి చేశా…. మరల నిండు మనస్సు తో ఆశీర్వదించండి
*ఎమ్మెల్యే రేగా కాంతరావు

బూర్గంపాడు మండలం లో కోటి 40 లక్షల రూపాయలతో సిసి రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా.

మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. పినపాక పట్టి నగర్,మోరంపల్లి బంజర,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలలో సుమారు ఒక కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించిన 28 సీసీ రోడ్లను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులతో కలిసి ప్రారంభించారు.మంగళవారం మండల పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా శాలువాలతో పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళు అని,కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం దారపోసేందుకు సిద్ధమయ్యాడని,ఆయన పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పడి నేడు అభివృద్ధి,సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్నము అని నీళ్లు,నిధులు,నీయామకాలు కోసం సాగిన పోరాటంతో స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి,సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని,అన్ని రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.సీఎం ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని,గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారనీ,పల్లె ప్రగతితో గ్రామాలు పచ్చదనంగా మారి,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ అన్నారు.గ్రామాల అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయిస్తుందని,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని,ప్రతి పల్లెకు పక్క రోడ్లను నిర్మించాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందనీ అన్నారు.గ్రామాలలో ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందనీ,నియోజవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని అన్నారు,ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న పినపాక నియోజకవర్గం లోని గ్రామీణ ప్రాంతాలలో సైతం అభివృద్ధి ఉరకలు వేస్తూ పరుగులు పెడుతుందనీ,ఏ మూలన చూసిన సీఎం కేసీఆర్ మార్కు అక్కడ కనిపిస్తున్నదని తెలిపారు.రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు గడపగడపకు నాయకులు వెళ్లి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని సీఎం కేసీఆర్ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ గ్రామ సర్పంచ్ సిరిపురం స్వప్న,మోరంపల్లి బంజర సర్పంచ్ భుక్య దివ్యశ్రీ,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భుక్య శ్రావణి,మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,అదేవిధంగా స్వసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మండల యూత్ ప్రెసిడెంట్ గొనెల నాని,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లురుపల్లి వంశీ,బూర్గంపహాడ్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ సోహెల్ పాషా,ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు మందా ప్రసాద్,మైనార్టీ మండల అధ్యక్షులు సాదిక్ పాషా,మండల ముఖ్య నాయకులు తోకల సతీష్,గంగరాజు యాదవ్,కొనకంచి శ్రీను,చుక్కప్లలి బాలాజీ,చలకోటి పూర్ణ,చైతన్య రెడ్డి,సాయిబాబా,కుమ్మరిపల్లి నాగరాజు తో పాటు పలువురు ముఖ్య నాయకులు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,ఉప సర్పంచులు,మండల బిఆర్ఎస్ నాయకులు,అనుబంధ సంఘ నాయకులు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,యువజన,మహిళా నాయకులు,అభిమానులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !