ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి మండల ప్రజలు నీరాజనం…
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
తిప్పనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుండి 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ లోకి చేరిక..
300ల బైక్ లతో యువత ర్యాలీ…
మన్యం న్యూస్ చండ్రుగొండ, సెప్టెంబర్ 5: ప్రజలు మెచ్చిన నాయకుడు పరిపాలన దక్షకుడు సిఎం కేసీఆర్ అని, అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. రూ.1.50కోట్లతో నూతనంగా నిర్మించిన సిసీరోడ్లను ఆయన ప్రారంభించారు. రూ.15 లక్షలతో సెర్పె కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మండల పర్యటనలో తొలుత మద్దుకూరు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అక్కడ నుండి మడల కమిటీ ఆధ్వర్యంలో 300ల బైక్లతో బారీ ర్యాలీ నిర్వహించారు. దామరచర్ల, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, తిప్పనపల్లి, వెంకటాపురం, రేపల్లెవాడ, తుంగారం, గానుగపాడు గ్రామాల్లో ఎమ్మేల్యే పర్యటనను పురష్కరించుకొని గజమాల, పూలమాలలు, డప్పువాయిద్యాలతో, కోలాట నృత్యబృందాలతో ఘనంగా ఎమ్మేల్యేకు స్వాగతం పలికారు. తిప్పనపల్లి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ వార్డు
సభ్యులు బోడా వెంకటేశ్వర్లు (బుగ్గయ్య), బిసీ నాయకుడు వేల్పుల రాజయ్య, యువజన నాయకుడు పసుపులేటి క్రాంతికుమార్ ల ఆద్వర్యంలో 50
కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మేల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు . వారందరికి ఎమ్మేల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నిపార్టీల కార్యకర్తలు, నాయకులు నేడు బిఆర్ఎస్ పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధిలు, అధికారులు రేవతి, సాదియా సుల్తానా, దారా వెంకటేశ్వరరావు (దారాబాబు), ఉప్పతల ఏడుకొండలు, మేడా మోహన్ రావు , భూపతి రమేష్, నల్లమోతు వెంకటనారాయణ, సయ్యద్ రసూల్, లంకా విజయలక్ష్మి, బానోత్ కుమార్, బూక్య రాజీ, లింగయ్య, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, బానోత్ రన్య, సత్తి నాగేశ్వరరావు, ఉన్న నాగరాజు, భూపతి శ్రీనివాసరావు,మధిరాల చినిపిచ్చయ్య, బడిగల శ్రావణ్ కుమార్, తలారి నాగరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.