పార్థివ దేహాలకు నివాళులు అర్పించిన విప్,ఎమ్మెల్యే రేగా సతీమణి రేగ సుధారాణి
*బాధిత కుటుంబాలకు రేగా సుధ క్క ఓదార్పు
మన్యం న్యూస్,మణుగూరు:
మండల పరిధిలోని గుట్టమల్లారం గ్రామ పంచాయతీ నందుగల కణితి బాబురావు మనవరాలు లాస్య(8 ) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది.అశోక్ నగర్ కి చెందిన తుమ్మ సరోజిని (50)అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణి మంగళవారం మృతుల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి అంతిమ యాత్రలో పాల్గొనివారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు జావేద్ పాషా,బీ. ఆర్.ఎస్ పార్టి సీనియర్ నాయకులు ఆవుల నర్సన్న ,మణుగూరు టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్, యువజన నాయకులు జక్కం రంజిత్, గుంటక ఏషవ్, వెంకన్న ,నాగెళ్ళి గోపి,వావిలాల నర్సయ్య ,మరియు రేగ సోషల్ మీడియా వారియర్ డేగల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
