UPDATES  

 పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
* హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 8 లక్షల చెక్కు అందజేత

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ గత మే నెలలో గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు కుటుంబానికి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్.జి తన చేతుల మీదుగా 8 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. భద్రతా విభాగం నుండి ఈ నగదును వారి కుటుంబానికి అందజేసినట్లుగా పేర్కొన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు, కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు యాకోబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !