సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు
* భద్రాద్రి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి
* డయల్ యువర్ కార్యక్రమం విజయవంతం
* స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజల సమస్యలను ఫిర్యాదులను స్వయంగా తెలుసుకునేందుకు ఎస్పీ చేపట్టిన డయల్ యువర్ కార్యక్రమం ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో భాగంగా మంగళవారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజల సమస్యలు ఫిర్యాదులను స్వయంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 17 మంది భాదితులు తమ సమస్యలు ఫిర్యాదులను తెలుపుకోవడానికి ఎస్పీని సంప్రదించారు. ఇందులో భూ తగాదాలకు సంభందించి 04, వ్యక్తిగత విషయాలకు సంభందించి 09, సాధారణ సమస్యలు 03, చీటింగ్ కేసులకు సంభందించి 01 సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను తెలుపుకోలేని వారు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తెలుపుకోవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.