మన్యంన్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు పంచాయతీరాజ్ శాఖ, కళాశాల రాజనీతి శాస్త్రాల సంయుక్త విభాగాల ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం సూచనల మేరకు కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు అవశ్యకత, ఈవీఎం, వివిప్యాట్ వినియోగంపై మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తగా విచ్చేసిన ఇల్లందు ఎంపీడీవో బాలరాజు మాట్లాడుతూ..భారత ఎన్నికల సంఘం వారు ఎలక్షన్స్ నందు ఉపయోగించే ఈవీఎం మరియు వివిప్యాట్ పట్ల ప్రతి ఓటరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కావున ప్రతి ఓటర్ నిబద్ధతను చాటుకోవాలని మన అభివృద్ధిని కాంక్షించు వారిని తమ నాయకుడుగా ఎన్నుకోవాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర లెక్చరర్ ఎం. రాజు, వైస్ ప్రిన్సిపల్ బిందుశ్రీ, ఐక్యూయేసి కోఆర్డినేటర్ కె. కిరణ్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ జి.శేఖర్, బి. చెంచరత్నయ్య, ఇంద్రాణి, డాక్టర్ సిహెచ్.రమేష్ , సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
