వశిష్ట విద్యా మందిర్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
తరగతి గదిలోనే దేశ భవిష్యత్ కరస్పాండెంట్ శ్రీనివాస్
మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 05, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో గల వశిష్ట విద్యా మందిర్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గురుపూజోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వశిష్ఠ విద్యా మందిర్ కరస్పాండెంట్ ఎనుముల శ్రీనివాస్ ను పాఠశాల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ తరగతి గది లోనే దేశ భవిష్యత్ వుంటుందని, బావి భరతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు అని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచేది గురువులేనని తెలిపారు. నేటి విద్యార్థులు మహనీయుల చరిత్రను తెలుసుకొని వారు చూపిన మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం అరుణ, కౌసర్, సుమిత్ర, సౌమ్య, నందిని, నిరోష, భార్గవి, శాంతి, రత్న కుమారి, వాణి, లావణ్య, దివ్య, తులసి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.