గిరిజనులను ఇబ్బందులు పెట్టవద్దు
* నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వండి
* జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
* పోడు పట్టాలు ఇచ్చి న్యాయం చేసాం
* శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
గిరిజనులకు ఇంటి నెంబర్లు కేటాయింపుకు చర్యలు చేపట్టాలని జడ్పి ఛైర్మన్ కోరం కనకయ్య తెలిపారు.
మంగళవారం జడ్పి కార్యాలయంలో వ్యవసాయ మిషన్ బగీరథ జాతీయ ఉపాధిహామి పథకం బిసి మైనార్టీ
సంక్షేమ శాఖలు అటవీ వైద్య పంచాయతీ శాఖలపై నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మంచినీటి సరఫరా గ్రామ పంచాయతీలు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని,
నిర్వహణ బాధ్యతలు ఏజన్సీలకు అప్పగించు విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మిషన్ బగీరథ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ లోపం వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని సభ్యులు
తెలుపగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇంటి నెంబర్లు
కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు. పోడు పట్టాలు రాలేదని సభ్యులు తెలిపిన వివరాల
మేరకు విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్సీ తాత మధు
సర్వసభ్య సమావేశంలో చర్చించిన అంశాలపై
లోతుగా విశ్లేషణ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్ హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటు తదుపరి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికి ఇస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పోడు పట్టాలు ఇచ్చామని చెప్పారు. పోడు
భూములకు పట్టాలు జారీ ప్రక్రియలో అనేక చిక్కుముడులు దాటుకుంటూ ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం
సహాకారంతో జిల్లాలో పోడు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపినట్లు చెప్పారు.
పట్టాల జారిపై విచారణ చేస్తా: కలెక్టర్
పోడు భూములకు పట్టాలు జారి కొరకు వచ్చిన దరఖాస్తులు విచారణ చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల చెప్పారు. సర్వే జరిగి పట్టాలు రాని వివరాలను జిల్లాస్థాయి కమిటిలో ఆమోదించారా తిరస్కరించారా
అన్న అంశాలను పరిశీలన చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పి వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, జడ్పి సిఈఓ విద్యాలత, జడ్పిటిసిలు, యంపిపిలు, కో ఆప్షన్
సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.