మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈవిఎం వివి ఫ్యాట్ గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలోని వివిపాట్, ఈవియం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా
గోదాం సీలు, సిసి కెమేరాలను పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవియం గోదాం వద్ద చేపట్టిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. ఈవిఎం ద్వారా ఓటు హక్కు వినియోగంపై నిర్వహిస్తున్న నమూనా పోలింగ్ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. నమూనా పోలింగ్ లో వివిపాట్ స్లిప్పులు భద్రపరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కొత్తగూడెం ఆర్డిఓ శిరీష, కొత్తగూడెం తహసీల్దార్ ప్రసాద్, ఎన్నికల విభాగం తహసీల్దార్ ప్రసాద్, రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.