కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్ నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చేపట్టిన నియోజకవర్గ పర్యటన మంగళవారం కామేపల్లి మండలంలో విజయవంతంగా సాగింది. మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ సమక్షంలో రుక్కీతండా గ్రామపంచాయతీ రాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో 25 కుటుంబాలు చేరాయి. వారికి ఎమ్మెల్యే హరిప్రియ గులాబి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గులాబీ కుటుంబంలోకి వచ్చాక ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఏం పొడిచారని మళ్లీ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. కుంభకోణాలకు కేరాఫ్ గా కాంగ్రెస్ తయారైందన్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలు అభివృద్ధిని చూసి సంక్షేమ పథకాల లబ్ధిపొంది నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నా హయాంలో ఇల్లందు నియోజకవర్గం అభివృద్ది చెందిందని, రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పారిశ్రామికంగానూ ఇల్లందును అగ్రగామిగా నిలబెడతానని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లాకావత్ బీమా, ఎంపీటీసీ బోడెపూడి అనురాధ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, ఎంపీపీ బానోత్ సునీత, కొత్త లింగాల కోట మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మల్లెంపాటి, ఉపసర్పంచ్ కొమ్మినేని శ్రీనివాసరావు, రైతుబంధు గ్రామ అధ్యక్షులు ఎలమద్ది అప్పారావు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చెల్ల హరి, నాయకులు జరుపుల బాల, దొడ్ల మల్లేష్, దండగల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.