పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత రేగాదే
ఇంటింటికి తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం
* రేగా హ్యాట్రిక్ గెలుపు తథ్యం
* బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్
మన్యం న్యూస్ , అశ్వాపురం: ఎస్ టి రిజర్వ్ నియోజకవర్గం ఐన పినపాకను అభివృద్ధి పథంలో కి తీసుకువచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మాత్రమేనని మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని మొండికుంట గ్రామ పంచాయతీ ఎస్టి కాలని లో ఇంటింటికి కేసీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపి రెడ్డి,ఉప సర్పంచ్ మేడవరపు సుదీర్ గ్రామ ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు.
